మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (16:43 IST)

శ్రీ‌ని క‌థానాయ‌కుడిగా ఆన్ ఎయిర్ రాబోతోంది

On Air look
On Air look
హీరో, దర్శకుడిగా కన్నడలో బీర్బల్ ట్రైయాలజీ, ఓల్డ్ మోంక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఎం జి శ్రీనివాస్ (శ్రీని) మరో విభిన్న థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ఆన్ ఎయిర్' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జే గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  
 
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో ఓ టీ టీ లో విడుదల కానుంది. 'బాహుబలి' 'ఆర్ ఆర్ ఆర్' వంటి పలు భారీ చిత్రాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ 'ఆన్ ఎయిర్' కు దర్శకత్వం వహించారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలు.