మొబైల్ గేమ్ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్ గేమ్ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్ గేమ్ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ గేమ్ డిజైనర్ మార్క్ స్కాగ్స్‌తో కలిసి చర్చలు జరిపారు రాజమౌళి. మార్క్ స్కాగ్స్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఫార్మ్ విల్లే, సిటీ విల్లే వంటి ప్రముఖ మొబైల్ గేమ్స్‌ను తయారు చేశారు.
ఈయన ఎస్ఎస్.రాజమౌళితో జరిపిన చర్చలను గురించి తన ట్విట్టర్ ఖాతాలో మాట్లాడుతూ 'రాజుతో మీటింగ్ చక్కటి అనుభూతి. ఆయనొక గొప్ప విజన్ ఉన్న దర్శకుడు, మంచి స్టోర్ టెల్లర్. 'బాహుబలి' ప్రాజెక్టులో భాగమవడం చాలా గౌరవంగా ఉంది' అన్నారు. ఇకపోతే 'బాహుబలి 2'ను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.