బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (12:05 IST)

అద్భుతం చేశారు.. చేతులెత్తి నమస్కరిస్తున్నా... బాహుబలిపై నాగార్జున ట్వీట్

దేశాన్ని ఊపేస్తున్న బాహుబలి మానియాకు హీరో నాగార్జున కూడా ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని వీక్షించిన నాగార్జు... చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా.. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క,

దేశాన్ని ఊపేస్తున్న బాహుబలి మానియాకు హీరో నాగార్జున కూడా ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని వీక్షించిన నాగార్జు... చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా.. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలు అద్భుతం చేశారంటూ కొనియాడారు. 
 
ఆదివారం ఉదయం ఈ చిత్రాన్ని చూసిన నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క రానా, రమ్యకృష్ణలు అద్భుతం చేశారని పొగిడారు. 
 
ఐదేళ్లపాటు బాహుబలి చిత్రం కోసం వారు ఎంతో అంకితభావాన్ని చూపారని అంటూ.. చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని ఉంచారు. నిమిషాల్లో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక ఈ ట్వీట్‌ను చూసిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి సైతం స్పందించారు. బాహుబలి టీం తరఫున నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు.