హోటల్ రిసెప్షనిస్ట్‌తో స్టార్ కమెడియన్ అసభ్య ప్రవర్తన.. ఆ హీరో లేకుంటే?
సినీ ఇండస్ట్రీలో మహిళలపై పలు రకాలుగా వేధింపులు జరుగుతున్నాయి. అందుకే సాధారణ ప్రజలలో సినిమా రంగం మహిళలకు సేఫ్ కాదనే భావన బలంగా ఉంది. అందరూ చెడ్డవారు కాకున్నా ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ స్టార్ కమెడియన్ హోటల్ రిసెప్షనిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈయన వయస్సులో పెద్దవాడు, సంపాదన కూడా ఎక్కువగానే ఉన్న ఈయన పలుమార్లు ఇలాంటి వివాదాలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో హైదరాబాద్‌లోని హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేయగా, దానికి ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సదరు స్టార్ కమెడియన్ కూడా సతీసమేతంగా వచ్చాడు. లోని ఓ హెటల్ లో సినీ హీరో ఏర్పాటు చేసిన పార్టీకి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు.
పార్టీలో ఫుల్లుగా మందుకొట్టిన కమెడియన్ కంట్రోల్ తప్పి భీభత్సం సృష్టించారు. అతడి భార్య కూడా అదుపు చేయలేక, భర్తను అక్కడి నుండి తీసుకెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో డ్రైవర్‌ని కారు స్టార్ట్ చేయమని చెప్పడం కోసం అతడిని అక్కడే వదిలి వెళ్లిందట.
ఆమె తిరిగొచ్చేలోగా అక్కడ పని చేస్తున్న రిసెప్షనిస్ట్‌ను తన చేష్టలతో ఇబ్బంది పెట్టగా, భరించలేకపోయిన ఆమె హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం కూడా దీనిని సీరియస్‌గా తీసుకుని, పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో తన పార్టీలో ఇలాంటి సంఘటన జరిగినట్లు బయట తెలిస్తే బాగుండదని భావించిన సదరు హీరో గొడవ సద్దుమణిగేలా చేశాడట. లేకుంటే ఈపాటికి స్టార్ కమెడియన్ కటకటాల వెనుక ఉండేవాడని సినీవర్గాలలో ప్రచారం జరుగుతోంది.