శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (16:50 IST)

ఇప్ప‌టికీ సోనాక్షి సిన్హాను ప్రేమిస్తున్నాన్న తెలుగు హీరో

Vyshnav- Sonakshi
అభిమానుల‌తో సోష‌ల్‌మీడియాలో త‌ర‌చూ అందుబాటులో వుంటున్నాడు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆయ‌న ప‌లుసార్లు ఉప్పెన స‌క్సెస్ త‌ర్వాత ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని వారి ప్ర‌శ‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ వేదిక‌పై అభిమానుల‌తో చ‌ర్చ‌లో పాల్గొన్నాడు. ఉప్పెన చేసిన కృతిశెట్టిలో మీకు న‌చ్చిన అంశం ఏమిట‌ని ఒక‌రు ప్ర‌శ్తిస్తే ఆమెలో సింగ‌ర్ దాగి వున్నారు. ఆమె మంచి గాయ‌ని కూడా అని బదులిచ్చాడు. క్రిష్ సినిమా ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింద‌ని అడిగితే, దాదాపు పూర్త‌యింది. నిర్మాణాంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుల చేసే ప‌నిలో నిర్మాత‌లు వున్నార‌ని తెలిపారు.
 
ఈ సినిమా త‌ర్వాత గిరీశ‌య్య అనే ద‌ర్శ‌కుడితో కొత్త సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇవి కాకుండా మ‌రో మూడు సినిమాలు క‌మిట్ అయ్యాను. అవి త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్నారు. అయితే గ‌తంలోనే త‌న‌కు బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా అంటే ఇష్ట‌మ‌ని ప్ర‌క‌టించాడు. అదే విష‌యాన్ని ఓ అభిమాని మ‌ర‌లా గుర్తు చేశాడు. ఆమెంటే ఇష్ట‌మే కాదు. ప్రేమ కూడా. ఇప్ప‌టికీ ఆమెను ప్రేమిస్తూనే వున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు వైష్ణ‌వ్ తేజ్‌. శ‌త్రుజ్ఞ సిన్హా కుమార్తె సోనాక్షి. మ‌రి మెగా ఫ్యామిలీ క‌నుక ఎటువంటి స‌మాధానం వ‌స్తుందో అటునుంచి చూడాలి.