ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:48 IST)

ధనుష్ సరసన కృతిశెట్టి.. కర్ణన్ సక్సెస్‌ చూసి బేబమ్మ ఓకే చెప్పేసిందట!

ఉప్పెన సినిమాతో తెలుగులోనే కాదు దక్షిణాదిన మంచి ఆఫర్లు అందుకుంటోంది కృతిశెట్టి. సొట్టబొగ్గలతో.. కొంటే చూపులతో కుర్రకారులో క్రేజీ అందుకున్న ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా స్టార్‌ హీరోల సినిమాలలో ఛాన్స్‌ రావడంతో కృతి యమ బీజీగా మారింది.
 
ప్రస్తుతం తెలుగులో రామ్‌ పోతినేని సినిమాలో, నాని శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళంలో ధనుష్‌ సరసన నటించే ఛాన్స్‌ అందుకుందట.
 
మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్‌ డైరక్షన్‌లో ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌‌గా కృతిశెట్టిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ డిసైడ్‌ అయ్యిందట. కర్ణన్‌ సక్సెస్‌‌తో జోష్‌ మీదున్న ధనుష్‌‌తో కలిసి నటించే ఛాన్స్‌ వస్తే ఎవరు కాదంటారు. అమ్మడు కూడా ఓకే చెప్పిందని టాక్‌.