శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (16:44 IST)

ప్రారంభోత్సవానికి రావాలా? 12 లక్షలు చూస్కోండి: బేబమ్మ గిరాకీ మామూలుగా లేదు

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ తెరపైకి ఉవ్వెత్తున ఎగసిపడి స్టార్ హీరోయిన్ అయిపోయిన నటి బేబమ్మ ఫేమ్ కృతిశెట్టి. ఇపుడు ఈమె కాల్షీట్ల కోసం కుర్రహీరోలు పడిగాపులు కాస్తున్నారట.

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు... ఈ ఫార్ములా కృతిశెట్టికి బాగా తెలిసినట్లుంది. నటించమంటే రూ. 60 లక్షలు పారితోషికం అడుగుతోందట. దీనికి ఇష్టపడిన నిర్మాతలు చాలామంది ఆమె కాల్షీట్లు తీసేసుకున్నారట
 
ఇకపోతే ఆమె క్రేజ్ దృష్ట్యా ప్రధాన నగరాల్లోని షాపుల ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్నారట. ఐతే ప్రారంభోత్సవాలకు రావాలంటే 12 లక్షలకు పైగా క్యాష్ డిమాండ్ చేస్తోందట. కృతి డిమాండ్ చూసి ఈవెంట్ మేనేజర్లు గుడ్లు తేలేస్తున్నారట. కొందరైతే ప్రస్తుతం ఆమె క్రేజ్ అలాంటిది కనుక అడిగిన మొత్తాన్ని ఇచ్చి రిబ్బన్ కట్ చేయించుకుంటున్నారట. మొత్తానికి బేబేమ్మ గిరాకీ మామూలుగా లేదు.