మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (17:29 IST)

బేబమ్మ భారీగానే డిమాండ్ చేస్తుందట.. కోటి దాటిందట!

''ఉప్పెన'' సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్‌తో వరుస ఆఫర్లు కృతిశెట్టి తలుపుతట్టాయి. ప్రస్తుతం మూడు ఎక్జయిటింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. పలు పెద్ద సినిమాల్లో కూడా కృతిని హీరోయిన్‌గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్‌.
 
అయితే కృతిశెట్టి నిర్మాతల దగ్గర తన ఆటిట్యూట్‌ను చూపిస్తోందట. బేబమ్మ ఇపుడు అసాధారణ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందన్న వార్త టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. షూటింగ్స్ స్పాట్‌కు కృతిశెట్టి వెంట వెళ్లే ఆమె తల్లి కూడా రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్‌. కృతిశెట్టి రెమ్యునరేషన్ ఇప్పటికే రూ.కోటి దాటినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.