శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (11:48 IST)

‘డియో డియో’ స్టెప్పులేసిన హీరో రాజశేఖర్... మేకింగ్ వీడియో

హీరో డాక్టర్ రాజశేఖర్, పూజ కుమార్‌, శ్రద్ధాదాస్‌‌లు కలిసి నటించిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నటించ

హీరో డాక్టర్ రాజశేఖర్, పూజ కుమార్‌, శ్రద్ధాదాస్‌‌లు కలిసి నటించిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నటించింది. సన్నీ చేసిన ఐటమ్ సాంగ్ ఇపుడు హల్ చల్ చేస్తోంది. ‘డియో డియో’ అంటూ ఈ సినిమాలో సన్నీ ఆడిపాడిన పాట వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ పాట మేకింగ్‌ వీడియో కూడా విడుదలైంది. 
 
అందులో సన్నీని చూసినవాళ్లందరూ ‘సన్నీ సూపర్‌... స్టెప్పులు బంపర్‌’ అంటున్నారు. మరి ఆ పాటకు రాజశేఖర్‌ ఇద్దరు కథానాయికలతో స్టెప్పులేస్తే ఇంకా బాగుంటుంది కదా. సినిమాలో ఆ అవకాశం లేకపోయినా... బయట మాత్రం కుదిరింది. అందులోనూ సినిమా విడుదల కాకుండానే. సినిమా ప్రచారం కోసం ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌కి వెళ్లిన చిత్రబృందం అక్కడ స్టెప్పులతో అలరించింది. రాజశేఖర్‌, పూజ కుమార్‌, శ్రద్ధాదాస్‌ కలసి ‘డియో డియో..’ అంటూ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి.