శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (12:26 IST)

హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్

rajinikanth
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. తమిళనాడులో అత్యధిక ఆదాయపన్ను చెల్లింపుదారుడు (హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్) అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును రజనీ తరపున ఆయన కుమార్తె ఐశ్వర్య అందుకున్నారు. 
 
ప్రతి యేటా జూలై 24వ తేదీన ఇన్‌కం ట్యాక్స్ డేగా నిర్వహిస్తుంటారు. ఆ ప్రకారంగా ఆదాయపన్ను శాఖ చెన్నై రీజియన్ ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో ఇన్‌కమ్ ట్యాక్స్ వేడుకలు జరిగాయి. 
 
ఇందులో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అవార్డును ప్రదానం చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, సినీ నటీనటుల్లో అత్యధికంగా ఆదాయ పన్నును చెల్లిస్తున్న వ్యక్తిగా రజనీకాంత్ నిలించారు. 
 
మరోవైపు బాలీవుడ్ నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్ అగ్రస్థానంలో నిలించారు. దేశంలోనే అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో ఒకడిగా, అత్యుత్తమ ఐటీ చెల్లింపుదారుగా పేర్కొంటూ ఐటీ శాఖ ఆయనకు తాజాగా ఓ సర్టిఫికేట్‌ను అందజేసింది. ఇపుడు రజనీకాంత్‌, అక్షయ్ కుమార్‌కు ఐటీ శాఖ ఇచ్చిన సర్టిఫికేట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.