శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (19:41 IST)

రెహ‌మాన్ ఆధ్వ‌ర్యంలో సుశీల బ‌యోపిక్‌

susheela, rehamn (blog)
ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. రెహ‌మాన్ నిర్మించిన సినిమా `99సాంగ్స్`. ఈ సినిమాకు ర‌చ‌న కూడా ఆయ‌నే. ఈ సినిమా క‌రోనా సెకండ్‌వేవ్ కాలంలోనే విడుద‌లైంది. కానీ థియేట‌ర్లో ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డంతో పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే జియో, నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేశారు. ఈ సినిమాను సుప్ర‌సిద్ధ గాయ‌నీ పి. సుశీల తిల‌కించారు. హిందీలో తీసిన ఈ సినిమాను తెలుగుకూడా విడుద‌లైంది. ఈ సినిమాను సుశీల సోద‌రుడు తెలుగు వ‌ర్ష‌న్‌ను చూపించారు.
 
సినిమా చూశాక సుశీల‌గారు ఎంత‌గానో రెహ‌మాన్‌ను మెచ్చుకున్నారు. ఇటువంటి సినిమా తీయ‌డం ప‌ట్ల క‌ళాకారుల గౌర‌వాన్ని మెట్టు పెరిగేలా చేశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమా చూశాక ఇదే త‌ర‌హాలో త‌న బ‌యోపిక్ కూడా చేయ‌మ‌ని రెహ‌మాన్‌ను కోరారు. ఇందుకు రెహ‌మాన్ సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించిన ప‌నులు చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్ల త‌న సోష‌ల్‌మీడియాలో రెహ‌మాన్ పేర్కొన్నారు. మ‌రి ఆమె పాత్ర ఎవ‌రు పోషిస్తారో చూడాలి.