గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (19:28 IST)

సుస్మితా సేన్‌కు యాంజియోప్లాస్టీ.. ఇన్ స్టాలో కృతజ్ఞతలు

47 ఏళ్ల సుస్మితా సేన్ కొద్ది రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని ఇన్‌స్టాలో వెల్లడించింది. ఆమెకు యాంజియోప్లాస్టీ చేశారు. ఈ సందర్భంగా సుస్మితా సేన్ తన తండ్రి చెప్పిన ఒక కోట్‌ను పంచుకున్నారు. ప్రజలు తమ హృదయాలను సంతోషంగా, ధైర్యంగా ఉంచమని ప్రోత్సహించారు.
 
తన ఆరోగ్య సమయంలో సకాలంలో సహాయం, నిర్మాణాత్మక చర్యలు అందించిన ప్రజలకు సేన్ తన ఇన్‌స్టా పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, మళ్లీ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. 
 
అలాగే తన శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు భరోసా ఇచ్చారు. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ సేన్ తన పోస్టును ముగించారు.