1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:19 IST)

ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్‌కు గుండెపోటు

flight
గగనతలంలో విమానం ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన యూకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ సీనియర్ విమాన శిక్షకుడు ఇంగ్లాండ్‌లో ఒక చిన్న విమానంలో ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్నాడు. 
 
గాలిలో ఎగురుతుండగా.. అకస్మాత్తుగా ట్రైనీ పైలట్‌కు గుండెపోటు వచ్చింది. అతను నిద్రపోతున్నాడని కోచ్ భావించాడు. తరువాత అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 
 
దీంతో విమానం ల్యాండ్ చేసిన కోచ్ అతడిని ఆస్పత్రిలో చేర్చాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడం పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది.
 
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురైనట్లు పోస్ట్‌మార్టం ఫలితాలు వెల్లడయ్యాయి.