బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (13:23 IST)

యూట్యూబ్‌లో "సైరా" సెన్సేష‌న్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సైరా నరసింహారెడ్డి". ఈ సంచ‌ల‌న చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన టీజ‌ర్, వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదిస్తోంది. తెలుగుతో సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్, ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ప్రధానాకర్షణగా సాగిన ఈ టీజర్, అద్భుతమైన విజువల్స్, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో రూపొందడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు. 
 
వీరితో పాటు కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతి బాబు, రవి కిషన్, తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా పాటలను అతి త్వరలో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబరు రెండో తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.