మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (19:04 IST)

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

Talli Manasu poster
Talli Manasu poster
ప్రేమమూర్తి అయిన ఓ తల్లి  తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో  "తల్లి మనసు"  చిత్రాన్ని మలిచారు. రచిత మహాలక్ష్మి,  కమల్ కామరాజు,  సాత్విక్,  సాహిత్య ప్రధాన పాత్రధారులు.  దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్  (సిప్పీ)  దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మిస్తున్న చిత్రమిది. 
 
నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం గురించి నిర్మాత ముత్యాల అనంత కిషోర్  మాట్లాడుతూ,  "ఆ మధ్య షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్  తో పాటు రీ రికార్డింగ్  వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే తొలికాపీ సిద్దమవుతుంది. అటుపిమ్మట సెన్సార్ పూర్తి చేయించి, ఈ  నవంబర్ నెలలోనే విడుదల చేస్తాం. డబ్బింగ్, రీ రికార్డింగ్ దశలో   ఈ చిత్రానికి పనిచేయని కొందరు  ఈ చిత్రాన్ని చూసి, ఓ మంచి చిత్రాన్ని తీశారని చప్పట్లు కొట్టి, ప్రశంసించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు కోటి సైతం చాలా మంచి చిత్రాన్ని తీశారని అభినందించారు " అని చెప్పారు. 
 
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, "మంచి కథ, కథనాలు ఒక ప్లస్ పాయింట్ అయితే, వాటిని తెరపైన తీర్చిదిద్దిన విధానం మరొక ప్లస్ పాయింట్. మొత్తం మీద మాకు చాలా సంతృప్తినిచ్చిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న నమ్మకం ఉంది" అని అన్నారు 
 
దర్శకుడు వి.శ్రీనివాస్  (సిప్పీ) మాట్లాడుతూ, ఓ మధ్య తరగతి తల్లి  ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా తెరకెక్కించామని చెప్పారు. నిర్మాత అభిరుచి కూడా చిత్రం చాలా బాగా రావడానికి దోహదం చేసిందని చెప్పారు.