తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైనలిస్ట్ పరిచయం చేసిన తమన్, కార్తీక్, గీతా మాధురి
తెలుగు సినీ సంగీత ప్రేమికులకు అద్భుతమైన సంగీత ప్రతిభను పరిచయం చేయటంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియన్ ఐడల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్యక్రమ వేదిక. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 అంతకు మించి భారీ ఆదరణను పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్‌కు చెందిన సింగర్స్ పార్టిసిపేట్ చేశారు. అలరిస్తోన్న ఈ ప్రోగ్రామ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అందులో భాగంగా ఐకానిక్ పినాలోలో భాగంగా ఫైనలిస్టులను ప్రేక్షకులకు పరిచయం చేశారు షో జడ్జెస్ తమన్, కార్తీక్, గీతా మాధురి. ఫైనలిస్టులుగా ఎంపికైన కార్తికేయ, శ్రుతి, జయరాం, లాస్య, సౌజన్య భాగవతుల తమదైన శ్రావ్యమైన గాత్రాలతో పాటలు పాడి అలరించారు.
ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ చాలా ఎనర్జిటిక్ అండ్ ఎంగేజింగ్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు.. ఎగ్జయిటెటింగ్ ప్రోగ్రామ్‌గా కూడా తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వచ్చింది. మూడు నెలలలుగా ఈ జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నా జర్నీలోని అడ్డంకులను కూడా దాటే అవకాశం కలిగింది. నేను కార్తికేయ, శ్రుతి, లాస్య వంటి వారి నుంచి కొత్త విషయాలను నేర్చుకున్నాను. ఆల్ రెడీ సూపర్ హిట్ అయిన పాటలను కొత్తగా పాడటం ఎలా అనేది చూసి ఆశ్చర్యపోయాను. నేర్చుకున్నాను అన్నారు.
సింగర్ కార్తీక్ మాట్లాడుతూ తెలుగు ఇండియన్ ఐడల్ జర్నీని మరచిపోలేను. తమన్‌గారితో మంచి అనుబంధం ఉంది. అదింకా బలపడింది. చాలా ఎంజాయ్ చేశాం. మరచిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నాను. ఇదింకా కొనసాగుతుందని భావిస్తున్నాను అన్నారు.
సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ నాకు ఇప్పటికీ తెలియని ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ఇంత మంచి జర్నీని నాకు అందించిన నా గురువులు, తల్లిదండ్రులు, ఆహా టీమ్‌కు థాంక్స్. అలాగే తమన్, కార్తీక్‌గారికి థాంక్స్. అలాగే ప్రోగ్రామ్‌ను హేమచంద్ర చక్కగా హోస్ట్ చేశారు. అద్భుతమైన సింగర్స్ వచ్చారు. ఇలా మంచి టీమ్ కుదరడంతో తెలుగు ఇండియన్ ఐడల్ 2 సక్సెస్ అయ్యింది అన్నారు.
హేమ చంద్ర మాట్లాడుతూ తెలుగు ఇండియన్ ఐడల్ కంటే ముందు నా జర్నీ డిఫరెంట్‌గా ఉండింది. అంతకు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. అయితే ఈ యాంకరింగ్ డిఫరెంట్‌గా మెప్పించింది. నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఆడిషన్స్ నుంచి చూస్తే అమేజింగ్ టాలెంట్‌ను ఆహా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అనేక దశలను దాటి ఫైనల్ స్టేజ్‌కు ఈ ప్రోగ్రామ్ చేరుకుంది. జడ్జీలుగా వ్యవహరించిన తమన్‌గారు, కార్తీక్, గీతా మాధురిగారికి థాంక్స్ అన్నారు.
ఫ్రీమాంటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరాధన మాట్లాడుతూ తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఐకానిక్ ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. తమన్, కార్తీక్, గీతా మాధురి కంటెస్టెంట్స్‌ను అద్భుతంగా ఎంకరేజ్ చేసి వారిలోని ఎనర్జీని పెంచుతూ వచ్చారు. వారి ఎనర్జీతో ఈ సీజన్ 2 సూపర్ సక్సెస్ అయ్యింది. 350 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించటం చూస్తే ప్రేక్షకులు మాపై ఎంత ప్రేమను చూపించారో అర్థం చేసుకోవచ్చు. అరవింద్‌గారికి, ఆహా టీమ్‌కు థాంక్స్ అన్నారు.