సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (21:41 IST)

అరెరె... Tamanah Bhatia తమన్నా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ (Video)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది.

తన తల్లిదండ్రులకు గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి అందరం కరోనా టెస్టులు చేయించుకున్నామనీ, ఈ పరీక్షల్లో దురదృష్టవశాత్తూ తన పేరెంట్స్‌కి కరోనా సోకినట్లు తేలిందన్నారు.
 
వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన తమన్నా తనకు కరోనా నెగటివ్ వచ్చినట్లు వెల్లడించారు. తన తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు తమన్నా భాటియా.