శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (09:18 IST)

తమిళ నిర్మాత, నటుడు కుమారజన్ ఆత్మహత్య.. ఒత్తిడే కారణమా?

తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్‌.. నమక్కల్‌లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. 
 
అతను సాంతిప్పొమ్‌ సింతిప్పొమ్ అనే చిత్రాన్ని నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తను కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లుగా కెరీర్‌ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
చెన్నై: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్‌.. నమక్కల్‌లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. అతను సాంతిప్పొమ్‌ సింతిప్పొమ్ అనే చిత్రాన్ని నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. 
 
కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తను కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లుగా కెరీర్‌ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.