గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (10:25 IST)

కోలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్యకు కారణమిదే...

ఇటీవల కోలీవుడ్ హీరోయిన్ రియామిక్కా ఆత్మహత్య చేసుకుంది. చెన్నై, వలసరవాక్కంలోని సొంత నివాసంలోనే ఆమె నవంబరు 29వ తేదీన బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలంగా సినీ అవకాశాలు రాకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడించారు. 
 
నవంబరు 29వ తేదీన ఆమె కాస్త ఆందోళనగా కనిపించింది. తన సోదరుడు ప్రకాష్‌తో కలిసి గత నాలుగు నెలలుగా ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాస్త ఆందోళనగా కనిపించిన ఆమె.. ఆ రోజు రాత్రే తన పడక గదిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
రియామిక్కా ఆత్మహత్య చేసుకోవడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. అవకాశాలు లేక చనిపోయిందా? ప్రేమ విఫలమైందా? అనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఆమెకు ఛాన్సులు లేకపోవడం వల్లే చనిపోయినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.