ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (14:24 IST)

అర్జున్ రెడ్డి హిరోయిన్‌‌పై తమిళ నిర్మాతలు ఫైర్...(video)

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన భామ షాలినీ పాండే. ఈ సినిమాలో ఆమె నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించడంతో ఆఫర్‌‌లు బాగా వస్తాయని ఆశించింది షాలీనీ పాండే.. కానీ అలా జరగలేదు. అర్జున్ రెడ్డి తరువాత హిరో కళ్యాణ్ రామ్‌‌తో 118లో నటించింది. కాని ఈ సినిమాలో చిన్న పాత్ర కావటంతో ఆమెకు అవకాశాలు ఏమీ రాలేదు. 
 
ఆ తర్వాత తెలుగులో 100% లవ్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ పేరుతో అనువదించారు. ఇందులో తమన్నా పాత్రలో షాలిని నటించింది. ఈ సినిమా ఈమధ్యనే రిలీజ్ అయింది. తమిళంలో మరికొన్ని చిత్రాలకు సైన్ చేసింది. అయితే అవి ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె ముంబయి వెళ్ళిపోయిందట. ముంబయి వెళ్ళిపోయిన ఆమె ఎవ్వరికీ అందుబాటులో లేనట్లు సమాచారం. దానికి కారణం ఏంటా ఆరా తీస్తే, ఆమెకు బాలీవుడ్‌‌‌లో 'బడా' సినిమాలో ఆఫర్ వచ్చిందని సమాచారం.
 
దీంతో ఆమెతో చిత్రం చేయాలనుకున్న నిర్మాతలు ఆమె ప్రవర్తన పట్ల మండిపడుతున్నారు. ఆమెకు బాలీవుడ్ చిత్రం అంత ముఖ్యం అయినపుడు ఇక్కడ సినిమాలు ఎందుకు ఒప్పుకుందని విమర్శిస్తున్నారు.