లవ్ స్టోరీ నుంచి చైతూ కొత్త లుక్.. లుంగీ, బనియన్ వేసుకుని..?

Nagachaitanya
సెల్వి| Last Updated: సోమవారం, 23 నవంబరు 2020 (12:51 IST)
Nagachaitanya
నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపుదిద్దుకుంటోంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంద. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరుపుకుంది. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల చెప్పారు. లుంగీ, బనియన్ వేసుకుని నాగచైతన్య పల్లెటూరి యువకుడిలా అదరగొడుతున్నాడు.

ఇక కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్, ఈమధ్యే పూర్తయింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. నాగచైతన్య , సాయిపల్లవి ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనపడతారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ.. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనిపై మరింత చదవండి :