శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (11:56 IST)

ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు.. రంగంలోకి తేజస్వి మదివాడ

'బిగ్ బాస్ తెలుగు' రెండో సీజన్‌లో పోటీదారులలో ఒకరైన నటి తేజస్వి మాదివాడ మళ్లీ రియాలిటీ షో యొక్క ఓటీటీ వెర్షన్‌లో కనిపించనున్నారు.

తేజస్వి మోడల్, నటి రెండవ సీజన్‌ ఓటీటీ వెర్షన్‌  షోలో కనిపించేందుకు తేజస్వి ఓకే చెప్పేసింది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో తోటి హౌస్‌మేట్స్‌తో ఆమె గొడవలు సంచలనాలను సృష్టించాయి.
 
బిగ్‌బాస్ హౌస్‌లో తోటి హౌస్ మేట్స్‌తో గొడవలు సీజన్‌లో సంచలనాలు సృష్టించాయి. "ఐస్ క్రీమ్" నటి  తేజస్వి అయిన 'బిగ్ బాస్' ఇంట్లో ఉన్న సమయంలో ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కొనసాగించింది. 
 
తాజాగా 'బిగ్ బాస్ తెలుగు ఓటిటి' మొదటి సీజన్ యొక్క కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కోసం వేదికను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 16-17 మంది పోటీదారులతో, 'బిగ్ బాస్ తెలుగు ఓటిటి' డిస్నీ+ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం చేయబడుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లెలుగా తేజస్వి కనిపించింది.