మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (09:27 IST)

నేడు ఓటీటీలో ఇంట్లోకి వస్తున్న 'బంగార్రాజు'

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్యలు కలిసి నటించిన చిత్రం "బంగార్రాజు". ఈ చిత్రం సంక్రాంతి పండుగకు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇపుడు ఈ చిత్ర బృందం అక్కినేని ఫ్యాన్స్‌కు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టిన బంగార్రాజు.. శుక్రవారం నుంచి ఓటీటీలో విడుదలకానుంది. 
 
శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్‌‍లో చూసిన ప్రేక్షలు, ఇప్పటివరకు ఈ  చిత్రాన్ని చూడని వారు ఇకపై తమతమ ఇంట్లోనే ఉంటూ చిత్రాన్ని చూడొచ్చు. కాగా, ఆరేళ్ళ క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లు కాగా, ఫరీదా అబ్దుల్లా ప్రత్యేక గీతంలో నర్తించారు .