సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (19:24 IST)

గుడిసెకు పర్యావరణ ముప్పు.. మార్చి20 వరకు బంద్

Gudese
గుడిసె పర్యాటక ప్రాంతానికి తాకిడి పెరడగంతో పర్యారణ ముప్పు ఏర్పడింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెత్తచెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. రాత్రులు మంటలు వేసుకోవడం, మద్యం సేవించిన బాటిల్స్ పగులకొట్టి పాడేయడం లాంటివి చేయడంతో వచ్చే నెల 20వ తేదీ వరకు అనుమతిని నిలిపివేశారు. గుడిసె పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే ఈ చర్యలు చేపట్టారు.
 
గుడిసె అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇకపోతే.. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. 
 
మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా పేరొందిన ప్రాంతం ఇది. నిత్యం వేలాదిమంది వాహనాల్లో ఇక్కడికి తరలివస్తుండడంతో సందడిగా మారుతోంది. మారేడుమిల్లి పరిసరాల్లోని జలపాతాలు, పర్యాటక ప్రదేశాలను అటవీశాఖ ఆధ్వర్యంలో సీబీఈటీల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.