ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (11:25 IST)

ముదిరిన కుటుంబ కలహాలు.. భర్తను మట్టుబెట్టిన భార్య

తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు బాగా ముదిరిపోవడంతో కట్టుకున్న భర్తను భార్య మట్టుబెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దంపతుల మధ్య కుటుంబ కలహాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో ఇవి బాగా ముదిరిపోయాయి. 
 
ప్రతి రోజూ భర్త వేధింపులను భరించలేక పోయింది. దీంతో అతని నుంచి విముక్తి పొందాలని నిర్ణయానికి వచ్చిన భార్య... ఆయన నిద్రబోతున్న సమయంలో హత్య చేసింది. ఆ తర్వాత భర్త మూర్ఛవ్యాధితో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం తెలిసింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.