గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (12:57 IST)

తండ్రిగా మారిన యువరాజ్ - మగబిడ్డకు జన్మనిచ్చిన హేజల్ కీచ్

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్బంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ ఆ ట్వీట్‌లో కోరారు. 
 
ఈ విషయం తెలిసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా యువరాజ్‌కు అభినందనలు తెలిపారు. "అభినందనలు సోదరా.. నువ్వో గొప్ప తండ్రివి అవుతావు. చిన్నారిపై బోలెడంత ప్రేమ కురిపిస్తావు" అంటూ ట్వీట్ చేశారు. కాగా, హేజల్ కీచ్‌ను యువరాజ్ సింగ్ గత 2016 నవంబరు 30వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.