ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: గురువారం, 27 జనవరి 2022 (19:50 IST)

ప్రియుడితో భార్యను చూసి సెల్ టవర్ ఎక్కిన భర్త... ఆ తర్వాత?

తన భార్య మీద నెలరోజులుగా భర్తకు అనుమానం. అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. ఎలాగైనాసరే భార్యను రెడ్ హ్యాండెండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. ఇంటి పక్కన వారు హెచ్చరించినప్పుడే నేను మేల్కొనాల్సింది. కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదని అనుకున్నాడు. పిల్లలు స్కూలుకు పంపించాడు. ఎప్పటిలాగే తను పనిమీద బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. ఇంకేముంది భర్త అలా వెళ్లగానే ప్రియుడు నేరుగా ఇంటికి వచ్చాడు. గదిలోకి దూరి తలుపులు వేశాడు. ఆ తరువాత..?

 
యుపిలోని కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. భన్వరీలాల్ అనే వ్యక్తికి పదేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భన్వరీలాల్ పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళితే సాయంత్రానికే వచ్చేవాడు. ఇక పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతూ ఉంటారు. 

 
అయితే మొదట్లో టీవీ సీరియళ్ళు చూస్తూ కాలం వెళ్ళదీసిన భన్వరీలాల్ భార్యకు ఇంటికి దగ్గరలోని ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతని పేరు ఆసిఫ్. తెల్లగా, అందంగా ఉండటంతో భన్వరీలాల్ భార్య అతనికి బాగా కనెక్టయ్యింది. వీరిద్దరు కాస్త శారీరకంగా కలవడం మొదలుపెట్టారు.

 
ఈ తతంగం కాస్త గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్నా.. ఇంటి చుట్టుప్రక్కలవారు వచ్చి చెప్పినా సరే భన్వరీలాల్‌కు మాత్రం భార్యపై ఎలాంటి అనుమానం రాలేదు. అయితే పిల్లలతోను, తనతోను భార్య సరిగ్గా మాట్లాడకపోవడంతో పాటు కోపంగా మాట్లాడుతూ ఉండటంతో భన్వరీలాల్‌కు అనుమానం మొదలైంది.

 
నిన్న ఉదయం యధావిధిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు భన్వరీలాల్. అంతేకాదు పిల్లలను స్కూలుకు పంపాడు. సాయంత్రానికి ఇంటికి వస్తానని బట్టలు ఉతకడంతో బిజీగా ఉన్న భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. కాసేపటికి ఇంటి వెనుక డోర్ నుంచి వచ్చి తన గదిలో దాక్కున్నాడు.

 
ఇంకేముంది అనుకున్నదే జరిగింది. ప్రియుడు ఆసిఫ్ నేరుగా భన్వరీలాల్ ఇంటికి వచ్చాడు. సైగ చేసి ఆమెను లోపలికి పిలిపించుకుని గది తలుపులు మూశాడు. ఇంతలో బయటకు వచ్చాడు భన్వరీలాల్. దీంతో షాకైన ఆసిఫ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

 
అయితే భన్వరీలాల్ భార్యపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తన ఇంటికి సమీపంలోని సెల్ టవర్ పైకి ఎక్కాడు. తన భార్య బాగోతాన్ని అందరికీ తెలిపాడు. పోలీసులు తన భార్యను శిక్షించాలన్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భన్వరీలాల్‌ను టవర్ నుంచి కిందకు దింపి అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.