శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 22 జనవరి 2022 (10:49 IST)

ఉద‌యాన్నే మంచు గ‌జ‌గజ‌... కాశ్మీరులోయను తలపిస్తున్న తుని!

నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు చ‌లి మాత్ర‌మే ఉండేది. కానీ ఇపుడు దానికి మంచు తోడ‌యింది. ఉద‌యాన్నే మంచు తెర‌లు క‌మ్ముకుని, తెల్ల‌ని దుప్ప‌టిలా ఊర్ల‌ను క‌ప్పేస్తోంది. ఊర్ల‌న్నీ కాశ్మీర్ లోయ‌ల‌ను త‌ల‌పించేలా మారుతున్నాయి.

 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం అంతా మంచు క‌ప్పేస్తోంది. కొత్త సురవరం ప్రాంతం కాశ్మీరు లోయలా మ‌రిపోయింది. కొండ‌లు, లోయ‌ల‌ను తలపించే విధంగా మంచు ప్రభావం ప్రకృతి సోయగాల నడుమ అంద‌రినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతంలో నివాసాలు ఏమాత్రం కంటికి కనిపించకుండా, కారు మబ్బుల వలె పూర్తి స్థాయిలో ప్రకృతి  సోయగం ఆకట్టుకుంటోంది. 
 
 
 ఒకవైపు సూర్యకిరణాలు ఆ ప్రాంతంలో పడుతున్నప్పటికీ, అక్కడున్ననివాసాలు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఏమాత్రం కనిపించని విధంగా మంచు దుప్పటి కప్పివేసింది. ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రకృతి సోయగాన్ని పలువురు వారి ఫోన్ లో బంధించుకుంటూ, ఉత్సాహంగా ప్రజలంతా గడుపుతున్నారు. చలి తీవ్రత సైతం ఎక్కువగా ఉండడంతో  గజగజలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా, ఈ వాతావ‌ర‌ణాన్ని స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.