శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (16:45 IST)

ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం

తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్టు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులు పలు జిల్లాల్లో సంచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. 
 
మంగళవారం ఉదయం పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం, కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మాత్రం నలుగురు మావోలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, పోలీసులు మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయినట్టు నిర్ధారించారు. అలాగే, మావోలు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. వీరిని హెలికాఫ్టరులో హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో నిమగ్నమైవుండగా మావోలు తారసపడటంతో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.