శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:36 IST)

తూగో జిల్లా లొదొడ్డిలో విషాదం - కల్తీ కల్లుతాగి ఐదుగురు మృత్యువాత

తూర్పు గోదావరి జిల్లా లొదొడ్డిలో విషాదం జరిగింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా గిరిజనులే కావడం గమనార్హం. జిల్లాలోన రాజవొమ్మంగి మండలంలోని లొదొడ్డిలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
ఈ గ్రామంలో విక్రయించే కల్లు సేవించేందుకు కొందరు గిరిజనలు బుధవారం ఉదయం వెళ్లారు. కల్లు తాగిన వారిలో కొందరు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. మృతుల్లో గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవ ఏసుబాబులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.