శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:01 IST)

ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో మృతి

ప్రముఖ మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 61 యేళ్లు. అలాగే, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా  ప్రదీప్ మరణాన్ని ధృవీకరిస్తూ, ప్రదీప్ ఆత్మకు శాంతికలగాలని నివాళులు అర్పించారు. 
 
కొట్టాయం ప్రదీప్ తన 40 సంవత్సరాల వయస్సులో 2001లో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను 70కి పైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటుడుగా పేరుగాంచారు. ప్రదీప్ తొలిసారిగా ఐవి శశి దర్శకత్వం వహించిన 'ఈనాడు ఎనలే వారే' చిత్రంలో నిపించారు. మలయాళ పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో, అతను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
 
ఆయన నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఆడు ఒరు భీగర జీవి ఆను, ఒరు వడక్కన్ సెల్ఫీ, లైఫ్ ఆఫ్ జోసుట్టి, కుంజిరామాయణం, అమర్ అక్బర్ ఆంటోని వంటివి అనేకం ఉన్నాయి.