బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (14:53 IST)

ఏపీలో విజయం తెలంగాణపై ఉంటుంది - తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పర్యటన

RK Sagar, Uma Reddy Prem Kumar, Damodar Reddy
RK Sagar, Uma Reddy Prem Kumar, Damodar Reddy
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో తెలంగాణ జనసేన  ప్రచార కమిటీ చైర్మెన్ ఆర్కే సాగర్ నేతృత్వంలో జనసేన పార్టీ  ముఖ్య నాయకులతో మిడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ  తెలంగాణ నేతలు శంకర్ గౌడ్, గ్రేటర్ నాయకులు రాజలింగం, కుకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ రెడ్డి ప్రెమ్ కుమార్,  నాయకులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఎపి ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తోన్న తెలంగాణ జనసేన నేతలు వివరించారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్  లోనీ తన నివాసం నుంచి కొండగట్టుకు  పవన్ బయలు చేరుతారని వారు వివరించారు. ఇప్పటి అందిన సమాచారం వరకు రోడ్డు మార్గాన కొండగట్టుకు జనసేన అధినేత వేళ్తున్నారని ఆర్కే సాగర్ తెలిపారు. పవన్ అభిమానులు, కార్యాకర్తలు పోలీసులకు అందరు సహరించాలి ఆయన విజ్ఞప్తిచేశారు. 
 
తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వేళ్తామని సాగర్ తెలిపారు.  తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాటం కోనసాగుతూనే ఉంటుందని జన సేన నాయకులు వివరించారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకేళ్తున్నారు అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని… ఏపీలో జనసేన విజయం తెలంగాణపై ఉంటుందని వారు వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా.. ఇతర పార్టీల వారు జనసేనలో చేరుతాను తమను సంప్రదిస్తున్నారని నాయకులు వివరించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటిచేయాలని పవన్ ను కోరుతామని వారు తెలిపారు. 
జనసేనలో పనిచేయటానికి యువత ఉత్సాహంగా ఉన్నారని… తెలంగాణా పై కి జనసేన క్షేత్రం స్థాయిలో విసృతంగా చేసేందుకు ఎల్లప్పుడు సిద్దంగా ఉంటామని జన సేన తెలంగాణా నాయకులు స్పష్టం చేశారు.