గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (13:19 IST)

'బిగ్ బాస్-4' సీజన్ కంటెస్టెంట్స్ వీరేనా??

ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే బిగ్ రియాలిటీ బిగ్ బాస్-4 సీజన్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సీజన్‌కు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 
 
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం ఈ  నెలాఖ‌రు నుండి ప్రారంభం కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే రెండు ప్రోమోలను నాగార్జున విడుదల చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించారు. 
 
అయితే, నాలుగో సీజన్‌లో పాల్గొననున్న నటీనటులు ఎవరన్న అంశాన్ని మాత్రం నిర్వాహకులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. అయిన‌ప్ప‌టికీ 16 మంది స‌భ్యుల జాబితా ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
 
బిగ్ బాస్-3 సీజన్‌లో పాల్గొన్న హీరో వ‌రుణ్ సందేశ్‌, ఆయన భార్య వితికాల జంట బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే. ఈసారి రెండు జంట‌ల‌ని ప‌ట్టుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలుస్తుంది. డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌ఘు, ఆయ‌న భార్య సింగ‌ర్ ప్ర‌ణ‌విలు ఓ జంట కాగా, మ‌రో జంట జాహ్న‌వి అలియాస్ మ‌హాత‌ల్లి ఆమె భ‌ర్త సుశాంత్ అని తెలుస్తుంది.
 
మిగ‌తా కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే 'జోర్ధార్' ఫేం ప్ర‌తికాంతం శృతి అలియాస్ సుజాత‌. మ‌రొక కంటెస్టెంట్ 'టిక్ టాక్' ఫేం అరియానా గ్లోరీ, వెబ్ సెల‌బ్రిటీ క‌మ్ డ్యాన్స‌ర్ మెహ‌బూబ్ దిల్ సే, వెబ్ సీరియ‌ల్స్ ఫేం సొహైల్ రియాన్, న‌టి క‌రాటే క‌ళ్యాణి, పాపుల‌ర్ యాంక‌ర్ లాస్య‌, న‌టుడు నందు, ర్యాప‌ర్ నోయెల్ సేన్, యాంక‌ర్ ప్ర‌శాంతి, 'జ‌బ‌ర్ధ‌స్త్' ఫేం ఆటో రాం ప్ర‌సాద్ అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.