శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (11:12 IST)

టాలీవుడ్‌‍లో మరో విషాదం : నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ మృతి

tollywood
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం సంభవించింది. ఇప్పటికే దిగ్గజ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన మృతి నుంచి చిత్రపరిశ్రమ తేరుకోకముందే ఇపుడు నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 86 యేళ్లు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 
 
రాజేంద్రప్రసాద్‌ మరణంతో టాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మాధవి పిక్చర్స్‌’ సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి అనేక అణిముత్యాల్లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు.