గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (09:45 IST)

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!

Siddu Jonnalagadda
Siddu Jonnalagadda
సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
తాజాగా మేకర్స్ మహారాష్ట్ర లో 24 రోజుల లాంగ్ షెడ్యూల్‌ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్ తో ఈ షెడ్యూల్‌ మొదలైయింది. ఈ షెడ్యూల్‌ లో సాంగ్ తో పాటు క్రూషియల్ టాకీ పార్ట్ ని షూట్ చేయనున్నారు. లీడ్ యాక్టర్స్ తో పాటు సినిమాలోని కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
 
ఈ చిత్రానికి థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.