బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (20:35 IST)

నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా చిత్రం ఫస్ట్ సాంగ్ షూట్

Neeraja kona at song shoot set
Neeraja kona at song shoot set
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ 'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.
 
తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కెకె లిరిక్స్ రాశారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ హ్యుజ్ సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించనున్నారు.
 
ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు.
 
నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
 
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష