ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (17:20 IST)

సిద్దు జొన్నలగడ్డ చిత్రం తెలుసు కదా షూటింగ్ లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి

Srinidhi Shetty,  Neeraja Kona
Srinidhi Shetty, Neeraja Kona
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ 'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు సాంగ్ ని షూట్ చేశారు.
 
తాజాగా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్‌ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌ లో చాలా కీలకమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.
 
నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.