సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (16:28 IST)

'తస్సాదియ్యా' అంటున్న చెర్రీ - కియారా (వీడియో)

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ఈ పరిస్థితుల్లో ఈ చిత్రంలో 'తస్సాదియ్యా...' అనే పాట వీడియో ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఈ పాట‌ని జస్ప్రీత్ జాజ్‌, మాన‌సి ఆల‌పించారు. తాజాగా ఈ డ్యూయ‌ట్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు. ఇందులో చ‌ర‌ణ్‌, కియారాలు త‌మ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. 
 
ఈ వీడియో అభిమానుల‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిత్రానికి దేవిశ్రీ అందించిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటించింది.