శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (14:56 IST)

వినయ విధేయ రామ ట్రైలర్‌కు భారీ వ్యూస్.. (వీడియో)

వినయ విధేయ రామ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 7.7 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. అంతేకాదు.. ఇది ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. 
 
వినయ విధేయ రామగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్‌, స్నేహ, ఆర్యన్‌ రాజేశ్‌, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. 
 
ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చరణ్ లుక్, యాక్షన్ బాగుందని కామెంట్లు చేస్తున్నారు.