చరణ్ వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్‌కు ముహుర్తం
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సక్సస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవల జరిగిన పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరనుందన్న విషయం తెలిసిందే. భారీ స్ధాయిలో నిర్వహించే ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 27న అంటే ఈ రోజు రాత్రి 9 గంటలకు విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మరి.. రంగస్థలంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చరణ్ వినయ విధేయ రామ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.