శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (15:36 IST)

కైరా అద్వానీ వెంటపడుతున్న యువ హీరోలు.. ఎవరెవరు?

భరత్ అను నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కైరా అద్వానీ. కైరాకు మోడల్‌గా మంచి పేరే ఉంది. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా కైరా అద్వానీ భాష తెలియకపోయినా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించగలిగింది. త్వరలో విడుదల కానున్న వినయ విధేయ రామ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కైరా.
 
అయితే కైరా అద్వానీ నటనకు చెర్రీ పడిపోయాడట. సింపుల్‌గా నటిస్తూ షూటింగ్‌లోని వారితో కలివిడిగా ఉంటూ కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయే కైరా అద్వానీ అంటే అందరికీ బాగా ఇష్టమట. సాధారణంగా అయితే హీరోయిన్లు షూటింగ్ జరిగేటప్పుడు మాత్రమే వచ్చి మిగిలిన సమయాల్లో వారికి కేటాయించిన గదుల్లో ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే కైరా అద్వానీ మాత్రం షూటింగ్ సమయంలో ఖాళీ దొరికితే చాలట. షూటింగ్ స్పాట్లో ఉన్న అందరితోను పిచ్చాపాటీ పెట్టేసుకుంటుందట. వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక పరిస్థితి అన్నింటిని అడిగి తెలుసుకుని అందరితోను కలిసిపోతోందట.
 
వినయ విధేయ రామ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో కైరాకు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయట. యువ హీరోలందరూ కైరానే కావాలంటున్నారట. చెర్రీ లాంటి హీరోకే కైరా అద్వానీ నచ్చేసిందంటే ఇక మిగిలిన హీరోల సంగతేంటో చెప్పనవసరం లేదు. ఇదే దూకుడుతో కైరా ముందుకు వెళితే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ల సరసన వెళ్ళిపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.