బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (11:53 IST)

ఆహాలో దూసుకుపోతోన్న ది బర్త్‌డే బాయ్

The birthday boy
The birthday boy
కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ది బర్త్ డే బాయ్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఓ ఐదుగురు స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు జనాలు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. 
 
ఐ భరత్ నిర్మించిన ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఈ చిత్రాన్ని బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని రకాల అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది.
 
ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. కథలోని టెన్షన్, ఎమోషన్‌ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్, కెమెరా పనితనం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. 
తారాగణం: రవికృష్ణ, సమీర్ మల్ల, రాజీవ్ కనకాల.