సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:31 IST)

"యానిమల్": రష్మిక-రణబీర్ కెమిస్ట్రీ అదిరింది.. సందీప్ సక్సెస్ అయ్యాడా?

Animal
Animal
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం "యానిమల్" టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రణబీర్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని టాక్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరో పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లోని రణబీర్, రష్మిక జోడీ చూడ చక్కగా వుంది. వీరిద్దరీ కెమిస్ట్రీని అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశారు సందీప్.  డిసెంబర్ 1న విడుదలయ్యే ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

మరోవైపు, సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతలు ముంబై, హైదరాబాద్, వైజాగ్‌లలో భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేసారు.