శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 డిశెంబరు 2020 (12:41 IST)

నటి అనుమానాస్పద మృతి, ఇంట్లో వంటరిగా ఒక్కతే వుంటోంది

బాలీవుడ్ నటి, మోడల్ ఆర్య బెనర్జీ అనుమానస్పద రీతిలో మృతి చెందారు. కోల్ కతాలోని తన ఇంట్లో బెడ్ పైన ఆమె శవమై కనిపించారు. డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యాబాలన్ తో కలిసి నటించిన బెనర్జీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
 
లాక్ డౌన్ నేపధ్యంలో ఆమె తిరిగి కోల్ కతా వెళ్లారు. తన గదిలో ఆమె గత కొన్ని రోజులుగా ఒంటరిగా వుంటున్నారు. పని మనిషి వచ్చి తలుపులు కొట్టగా ఆమె తలుపు తీయలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీనితో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేసారు.
 
ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా బెడ్ పైన ఆమె శవమై కనిపించారు. బెడ్ పక్కనే వాంతులు చేసుకున్నట్లు ఆనవాళ్లు వున్నాయి. అక్కడ కొన్ని రక్తపు చుక్కలు కూడా పడి వున్నాయి. ఐతే తలుపులు వేసినవి వేసినట్లే వున్నాయి. దీంతో ఆమెది ఆత్మహత్య అయి వుంటుందని అనుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.