శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (15:38 IST)

దెయ్యాలుగా మారిపోయిన మెగా ఫ్యామిలీ సభ్యులు.. చిరంజీవి కూడా...

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులంతా దెయ్యాలుగా మారిపోయారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో చుట్టుపక్కల జనం జడుసుకున్నారు. ఇంతకీ వీరందరూ దెయ్యాలుగా ఎలా మారిపోయారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనాన్ని చదవండి. 
 
ఏ పండుగ అయినా, ఏ కార్యక్రమమైనా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటచేరి సందడి చేయడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా మెగా కుటుంబం మొత్తం కలసి "హాలోవీన్" పండుగ చేసుకున్నారు. అందరూ దెయ్యాల మాదిరి మేకప్, డ్రెస్సింగ్ వేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉపాసన, నిహారిక, సాయి ధరమ్ తేజ్, సుష్మిత ఇలా అందరూ కలసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ మన దేశంలో కూడా విస్తరిస్తోంది.