1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:33 IST)

ధర్మపురి ట్రైలర్‌లో అభ్యంతకర సీన్‌ను తొలగించాం

Dharmapuri  poster
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కిన‌ సినిమా 1996 ధర్మపురి. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 1996 ధర్మపురి. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి. కాగా, ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక గౌడ కుల‌స్తులు అభ్యంత‌రం చెప్పారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
 
 గౌడ కుల సంఘం పెద్దలకు , గీత కార్మిక సహోదరులకు మయొక్క ధర్మపురి మూవీ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 రోజులుగా ధర్మపురి మూవీలోని ట్రయిలర్‌లో గౌడన్న ముఖము మీద కల్లు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు , సోదరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మొదటగా సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాము. ఆ సన్నివేశం ట్రైలర్‌లో,   సినిమాలో తొలగించడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాము. మిగతా సినిమా లో అన్ని సన్నివేశాలు గీత కార్మికుల, గౌడన్నల వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మా సినిమా ఉంటుంది. దయచేసి మన గౌడ సంఘాల పెద్దలు, గీత కార్మిక సహోదరులు అందరూ... కొత్తగా వస్తున్న మాయొక్క సినిమా ను , మమ్మల్ని  అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నామ‌ని తెలిపారు.