సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (17:40 IST)

హీరోకి కావాల్సిన కసి విజయ్ రాజాలో కనిపించింది: తనికెళ్ళ భరణి

Vijayraja, sivaji raja, bharani and others
Vijayraja, sivaji raja, bharani and others
సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా లక్ష్మీనారాయణ.సి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి విలా సినిమాస్ బ్యానర్ పై ఆర్.లక్ష్మణ్ రావు, ఆర్.శ్రీను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి 'జీరో'అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఈ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.
 
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో యాక్టర్ తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో శివాజీ రాజా ఆత్మబంధువు లాంటి వ్యక్తి. తనతో ఎన్నోఏళ్ల అనుబంధం వుంది. 'జీరో' గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. సినిమా హీరోకి కావాల్సిన కసి విజయ్ రాజాలో కనిపించింది. మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. డైరెక్టర్ చాలా ఎమోషనల్ గా తీశారు. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ సినిమా నిర్మించారు. వారికి తప్పకుండా అందరి ఆశీస్సులు వుంటాయి. శివాజీ రాజాని ఎలా ఆదరించారో, నన్ను ఎలా గౌరవించారో..  విజయ్ రాజాని కూడా అలానే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తండ్రిలానే మంచి పేరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.  
 
యాక్టర్ శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భరణి అన్నయతో నాకు ఎంతో అనుబంధం వుంది. ఆయనకి డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సందర్భంగా వారికి అభినందనలు. 'జీరో' గ్లింప్స్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు సినిమా అంటే చాలా పాషన్. డైరెక్టర్ గా అద్భుతంగా సినిమాని తీశారు. సాయి కార్తిక్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమా చాలా బావొచ్చింది. ప్రేక్షకులందరూ మా అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ' అన్నారు.      
 
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ..ఈ ఈవెంట్ కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన తనికెళ్ళ భరణి గారికి థాంక్ యూ సో మచ్. నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన అమ్మనాన్నలకు థాంక్ యూ. సాయి కార్తిక్ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. దర్శక నిర్మాతలకు థాంక్. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది'అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. విజయ్ సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. ఒక అథ్లెట్ ఎదుర్కుకునే సవాళ్ళని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ లక్ష్మీనారాయణ.సి.. మన స్పోర్ట్స్ లో వుండే పాజిటివ్స్ , నెగిటివ్స్ నిన్ బేస్ చేసుకొని ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తీశాం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, హీరో విజయ్ రాజా కి థాంక్ యూ. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అన్నారు
 
నిర్మాత ఆర్.శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది మా ప్రొడక్షన్ నెంబర్ 2. విజయ్ రాజా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూ లేకుండా పరిగెత్తేవారు. ఆయన కష్టం చూస్తే చాలా ఎమోషనల్ గా కనిపించింది. సినిమా తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది' అన్నారు  
 
నిర్మాత ఆర్.లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమాలో  అందరికీ కనెక్ట్ అయ్యే ఇంట్రస్టింగ్ పాయింట్ వుంది. మనం అందరం ఎదో ఒక స్పోర్ట్ ఆడే వుంటాం.  రెండో సినిమాగా ఈ మూవీని చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి టీంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది' అన్నారు  
 
నటీనటులు- విజయ్ రాజా రాజేంద్ర ప్రసాద్, ఆమని, శివాజీ రాజా, సంపత్ రాజ్, ఎల్సా ఘోష్, రూప లక్ష్మి, వినయ్ మహదేవ్