Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం: వెల్లడించిన వరుణ్

Written By ఠాగూర్
Updated: బుధవారం, 29 జులై 2020 (14:54 IST)
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినీ హీరోయిన్. బుల్లితెర యాంకర్ కూడా. అయితే, ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుంది. గుంటూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త చైతన్య అనే యువకుడిని పెళ్ళాడనుంది. ఈ వివాహ వేడుకను త్వరలోనే నిర్వహిస్తామని తండ్రి నాగబాబు ఇటీవల వెల్లడించారు. 
 
అయితే, తాజాగా నిహారిక అన్నయ్య, సినీ హీరో వరుణ్ తేజ్ ఈ వివాహంపై స్పందిస్తూ, నిశ్చితార్థ తేదీని వెల్లడించాడు. ఆగ‌స్టు 13వ తేదీన ఇరు కుటుంబాల పెద్ద‌ల స‌మ‌క్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది బంధువుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల తనకు కాబోయే భర్తతో కలిసి నిహారిక దిగిన ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. దీంతో నిహారిక పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఆమెకు పలువురు టాలీవుడ్ హీరోలకు ముడిపెడుతూ అనేక కథనాలు వచ్చిన విషయం తెల్సిందే.

అన్నీ చూడండి

ఆరు నెలలకే అసంతృప్తి - డీఎంకేను వీడనున్న మాజీ ముఖ్యమంత్రి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. గుల్లకోటలో భారీ వర్షపాతం

ఆస్పత్రులపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్ సర్కారు

గట్టర్ జనరేషన్ రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయ్ : కంగనా రనౌత్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... జలాశయాలకు పోటెత్తుతున్న వరద నీరు

అన్నీ చూడండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

తర్వాతి కథనం
Show comments