గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:01 IST)

స‌మంత శాకుంత‌లం ప్ర‌త్యేక‌త‌లు ఇవే!

Samantha, Shakuntalam, lallu
ద‌ర్శ‌కుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. శాకుంతల పాత్రను స్టార్ నటి సమంత చేయనుంది. ద‌ర్శ‌కుడు గుణశేఖర్ చిత్రంలోని ప్ర‌తి అంశాన్ని చారిత్రాత్మ‌కంగా వుండాల‌ని చూస్తున్నాడు. అందుకుగాను భారీ సెట్లను వేస్తున్నారు. మణిశర్మ చేత మంచి బాణీలు చేయించుకుంటున్నారు. మ‌రో ప్ర‌త్యేక‌త ఏమంటే ఇటువంటి సినిమాకు దుస్తుల కోసం ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకోవాలి. అందుకే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీత లుల్లాను తీసుకున్నారు. నీత లుల్లా బాలీవుడ్లో పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్. శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ లాంటి ఎంతోమంది పెద్ద సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేశారు ఈమె. ‘మొహెంజొదారో, బాలగంధర్వ, దేవదాస్’ లాంటి సినిమాలోని కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో జాతీయ అవార్డులను అందుకున్నారు. 
 
ల‌ల్లూను తీసుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అంతేకాకుండా అప్ప‌టి కాలానికి సంబంధించిన విధంగా చేనేత కార్మికుల ఎపిసోడ్ వుంది. అందుకోసం మంగ‌ళ‌వార‌మే తెలంగాణాలోని ఓ గ్రామంలోని ఓ చేనేత కుటుంబం ఇంటికి  డిజైన‌ర్ నీత లుల్లా వెళ్ళి అక్క‌డ కార్మికుడు చేనేత దుస్తులు ఎలా త‌యారుచేస్తున్నాడో వాటి వివ‌రాల‌ను తెలుసుకునే వీడియోను ద‌ర్శ‌కుడు విడుద‌ల చేశారు. ఇలా ప్ర‌తిదీ చిత్ర ప్ర‌మోష‌న్‌కు వాడుకుంటున్నాడు.
 
ఇక ఈ చిత్ర క‌థాప‌రంగా చూసుకుంటే మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోఈ సినిమాను అన్ని విభాగాల్లోనూ గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో గుణశేఖర్ పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లో స‌మంత పాత్ర తీరును కూడా విడుద‌ల‌చేయ‌బోతున్నారు.