గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (19:56 IST)

మాన‌సిక బలం ఇదే అంటున్న రాశీఖ‌న్నా!

Rasikhanna
ఫిట్‌నెస్‌కోసం హీరోయిన్లు ర‌క‌ర‌కాల వ్యాయామాలు, యోగాలు చేస్తుంటారు. మ‌రికొంద‌రు కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణే రాశీఖ‌న్నా. ఇటీవ‌ల త‌ర‌చూ సోష‌ల్‌మీడియాలో త‌న ఫొటోలు, ఫిట్‌నెస్ కోసం సూచ‌న‌లు పెడుతూనే వుంది. తాజాగా బాక్సింగ్ ఫొటో దిగి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బాక్సింగ్ డ్రెస్ లో అదరగొట్టిన క్యూటీ అంటూ కొంద‌రు కామెంట్లు కూడా చేస్తున్నారు. రాశీ ఖన్నా బాక్సింగ్‌ నేర్చుకుంటున్నారు అన్నది కన్ఫర్మ్ అయింది. కానీ అది ఏదైనా క్యారెక్టర్‌ కోసం నేర్చుకుంటున్నారా? అనే ఆ విషయాన్ని మాత్రం స్పష్టం చేయడంలేదు. మరింత ఫిట్‌గా కనబడటం కోసమే ఈ ట్రైనింగ్ అంటోంది.

ఆమె స్పందిస్తూ ‘‘శరీర శక్తిని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం బాక్సింగ్‌. పైగా నేను తీసుకుంటున్నది ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌’ (హెచ్‌ఐఐటి). రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా.కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్‌ ఉంటుంది. బాక్సింగ్‌ అనేది శారీరక బలం మాత్రమే కాదు. మానసిక బలాన్నీపెంపొందిస్తుంది అని చెబుతోంది. తాజాగా హిందీలో ‘సన్నీ’ అనే సినిమాలో న‌టిస్తోంది.